Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-ఓయూ
తార్నాక మెట్రోస్టేషన్ కింద ప్రయాణిస్తున్న కారు ఇంజన్లో మంటలు రావటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డ ఘటన ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం టాటా విస్టా ఏపీ03 బీటీ 3323 నంబర్ గల కారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా తార్నాక మెట్రో స్టేషన్‌కు చేరుకోగానే ఇంజన్లో, కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్ సురేష్‌తోపాటు మధు, విజరు, విక్రమ్‌లు కారులో నుంచి బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. సమాచారం అందుకున్న పోలీస్‌లు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.