Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రయివేటీకరణ పేరుతో దేశాన్ని వివిధ రంగాల్లో సర్వనాశనం చేస్తున్న బీజేపీ కూటమిని ఓడించడానికి డీఎంకే సెక్యులర్ కూటమికి మద్దతుగా దక్షిణ భారత రాజకీయ జేఏసీ మూడు రోజులు తమిళనాడులో ప్రచారానికి వెళుతుందని జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఓయూలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎంకే కూటమి ఆహ్వానం మేరకు తాము మూడు రోజులు తమిళనాడులో ప్రచార నిర్వహిస్తామన్నారు. తమిళనాడులో ఒక్క సీట్ అయినా సాధించాలని ఆశపడుతున్నా బీజేపీ ఆశలు అడియాశలు అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. సమావేశంలో జేఏసీ వైస్ చైర్మెన్లు పరిగి రామన్న, మహమ్మద్ రఫీ, స్కాలర్స్ కన్వీనర్ శివ, విద్యార్థి విభాగం కన్వీనర్ అవినాష్ తదితరులు తమిళనాడుకు బయల్దేరనున్నట్లు తెలిపారు.