Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంట నగరాల నిరుద్యోగులకు ఈనెల 7న సీతాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో సెట్విన్ సంస్థ ఆధ్వరంలో నిర్వహించతలపెట్టిన మెగా జాబ్‌మేళాను కోవిడ్ నిబంధనల దష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సైతం వివిధ సందర్భాల్లో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో జాబ్ మేళాలు నిర్వహించి 35 వందల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. నిరుద్యోగులను ఆదుకొని వారికి ఉపాధి కల్పించేందుకు తాము నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తి నివారణలో సహకరించాలని ఆయన సూచించారు.