Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నర్సింహ
నవతెలంగాన-హైదరాబాద్
ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన మున్సిపాలిటీ కార్మికుడు బిక్షపతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈ నర్సింహ, తుర్కయంజాల్ మున్సిపాలిటీ బాధ్యుడు డి.కిషన్ ప్రభుత్వాన్ని కోరారు.తుర్కయాంజల్ మున్సిపాలిటీలో కార్మికుడు, తొర్రూరు గ్రామానికి చెందిన తిప్పగళ్ల బిక్షపతి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మరణం మున్సిపల్ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి డి.కిషన్, సీపీఐ(ఎం) అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఇ.నర్సింహ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు డి.శ్రీధర్ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎస్.నగేష్, దానయ్య, గోపాల్, రంగయ్య, శ్రీరాములు, స్వరూప, పుష్పమ్మ, పద్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.