Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సమ్యక్-2021' ఇండియా ప్రపంచ రికార్డు సాధించింది. దేశంలోనే భారీ స్థాయిలో టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించారు. అయితే ఇండియా వరల్డ్ రికార్డును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హనరరీ డైరెక్టర్ డాక్టర్ జీవీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ చేతులమీదుగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్ఎస్ఎస్రెడ్డి అందుకున్నారు. మార్చి 19-20 తేదీల్లో 217ఈవెంట్లను నిర్వహించారు. రోజుకు సుమారు 10వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారు.