Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టుకున్న ట్రాఫిక్ సిబ్బంది
నవతెలంగాణ-బేగంపేట్
లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి టూవీలర్‌నే ఎత్తుకెళ్లిన సంఘటన గోపాలపురం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అరవింద్ అనే యువకుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఉండగా ఓ వ్యక్తి (35) లిఫ్ట్ అడిగాడు. అరవింద్ అతడిని తన స్కూటీపై ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో దాహం వేస్తోంది నీళ్లు తాగుతానని లిఫ్ట్ అడిగిన వ్యక్తి అరవింద్‌తో చెప్పాడు. స్కూటీ ఆపాల్సిందిగా కోరాడు. దీంతో అరవింద్ టూ వీలర్‌ను ఆపాడు. వెంటనే లిఫ్ట్ అడిగిన వ్యక్తి తాను పోలీసునని బెదిరించి స్కూటీని తీసుకుని పరారయ్యాడు. దీంతో అరవింద్ చిలకలగూడ క్రాస్‌రోడ్‌లో డ్యూటీలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. స్కూటీ నెంబర్‌తో సహా నిందితుడి ఆనవాళ్లు సేకరించిన పోలీసులు నిఘా పెట్టారు. వారంకిందట జరిగిన ఈ ఘటనకు సబంధించి స్కూటీ ఎత్తుకెళ్లిన నిందితుడు శుక్రవారం ఉదయం చిలకలగూడ క్రాస్‌రోడ్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారించగా అతని పరు బాలరాజు (35) అని, ఊరు జనగాం అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ట్రాఫిక్ పోలీసులు గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీ ఎత్తుకెళ్లిన నిందితుడిని పట్టుకున్న వారిలో ట్రాఫిక్ పోలీసులు కిరణ్‌కుమార్, రఘు, విజయారావు, నారాయణ ఉన్నారు.