Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమించి గుళ్లో పెళ్లి చేసుకొని గర్భందాల్చిన యువతిని పెళ్లి చేసుకుందామని నమ్మించి మోసం చేసిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటికి పిలిచి అవమానించడంతో యువతి తాను ఉండే హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ తరుణంలో పోలీస్ అధికారులు చేసిన స్పెషల్ ఆపరేషన్లో సాంకేతిక సహకారంతో యువకుడు ఉండే ప్రాంతాన్ని పక్కాగా తెలుసుకొని శుక్రవారం సాయంత్రం నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.