Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
గోల్నాక డివిజన్ పరిధిలోని మారుతినగర్లో కొంత కాలంగా జన వాసుల మధ్యలో అక్రమంగా యాసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆ ట్యాంకు బ్లాస్ట్ అయి జనాలు నివసి స్తున్న ఇంట్లోకి రావడంతో కాలనీ వాసులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనీ, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఆ యాసిడ్ ఫ్యాక్టరీలో ఎలాంటి అనుమతుల్లేకుండా స్విమ్మింగ్ పూల్‌ను ఈ మధ్యలోనే ప్రారంభించారనీ, ఈ విషయంపై కూడా అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నదని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకన్న కార్పొ రేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో మాట్లాడి జన నివా సాల మధ్య పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలనీ, డివిజన్లో మరికొన్ని చోట్ల పర్మిషన్ లేని ఇండిస్టియల్స్ను వెంటనే గోల్నాక డివిజన్ నుంచి తరలించాలని అధికా రులను ఆదేశించారు. అనుమతుల్లేకుండా జనావాసాల మధ్య నడుస్తున్న ఫ్యాక్టరీలను స్థానిక అధికారులతో కలిసి వెంటనే గుర్తించి చర్యలు తీసుకు ంటామనీ, ప్రజలకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని కార్పొరేటర్ హామీనిచ్చారు.