Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఐసీఎంఆర్-తార్నాకలోని జాతీయ పోషక ఆహార సంస్థలో సీనియర్ శాస్తవ్రేత్తగా పని చేసున్న డా.జి.భాను ప్రకాష్ రెడ్డి ''ఫేలో ఆఫ్ నామ్స్ గా ఎంపికయ్యారు. ( నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) ఎన్ఐఎన్లో బయో కెమిస్ట్రీ విభాగాపు అధిపతిగా ఉన్న భానుప్రకాశ్ సూక్ష్మ, పరమణు పోషకాలపై చేసిన పరిశోధనలకు గాను ఆ అరుదైన గుర్తింపు లభించింది. వైద్య రంగంతో పాటు, సామాజిక, ఆరోగ్య లక్ష్యాలకు ఉపయోగపడే వివిధ పరిశోధనలు చేసే వారికే నామ్స్ ఈ గుర్తింపు ఇస్తుంది. సూక్ష్మ పోష కాలు, పరమాణు పోషణ అంశాలపై ఆయన 190కి పైగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమైనాయి. ఇంతకు ముందు ఆయనకు ఐసీఎంఆర్-బయోటెక్నలజీ విభాగం, గేట్స్ ఫౌండేషన్, సోక్పస్ లాంటి ప్రతిష్టాత్మ కమైన సంస్థలు అవార్డ్స్ ప్రదానం చేశాయి. తన ఈ పరిశో ధనలో సూక్ష్మ లోపాల ప్రాభల్యం, స్థితిని అంచనా వేయడనికి ఆయన బయోమర్కర్లను అభివృద్ధి పరిచారు. పిల్లల్లో సంభవించే డయాబెటిక్ ఊబకాయం సంబ ంధిత సమస్యలను అధ్యయనం చేయడానికి జంతు నమూనాలను అభి వృద్ధి చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సు, ఏపీ అకడమి ఆఫ్ సైన్సు, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వంటి పలు సైన్సు ప్రతిష్టాత్మకమైన సంస్థ లతో కలసి భాను ప్రకాష్‌రెడ్డి పని చేసున్నారు. నామ్స్ పెలోగా ఎంపిక కావడం పట్ల శాస్త్రవేత్తలు, పలు జాతీయ, రాష్ట్ర స్థాయి సైన్సు పరిశోధనా సంస్థలు ఆయన వద్ద పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.