Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజిగూడ డివిజన్‌కు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యలో రోజుకొకరు డివిజన్‌కు చుట్టపుచూపుగా వచ్చి మొస లి కన్నీరు కారుససజ్తూూ ప్రజలను తప్పుదోవ పట్టించ డానికి పాదయాత్ర చేస్తున్నారని లింగోజీగూడ డివిజన్ టీఆర్ ఎస్ అధ్యక్షులు తిలక్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన లింగోజీగూడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడా రు. వరదలు వచ్చి నప్పుడు సామ రంగారెడ్డి ఎక్కడ ఉన్నా రని ప్రశ్నించారు. వరదలు వచ్చిన సందర్భంలో సామ రంగారెడ్డి ఎప్పుడైనా లింగోజీగూడ డివిజన్‌కు వచ్చి బాదితులను పరామర్శించారా, ఎప్పుడైనా డివిజన్ సమస్యలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. బాక్స్ టైప్ డ్రైన్స్ నిర్మాణ పనుల విషయాల్లో ఇప్పటి వరకు మీరు ఏమైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఏ హక్కుతో విమర్శిస్తున్నారని ప్రశ్నిం చారు. కరోనా కారణంగా కొంతమేర పనులు ఆలస్యమైన మాట వాస్తవమేననీ, ప్రస్తుతం బాక్స్ టైప్ డ్రైన్స్ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. లింగోజీగూడ డివిజన్ లో కేవలం ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీని వాసరావు చొరవ వల్ల అభివృద్ధి పనులు జరిగిన మాట వాస్తవమన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్లో ఎలాంటి సమస్యలు లేకుండా సస్యశ్యామలంగా చేసే విధంగా ప్రణా ళికలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూపొందిస్తున్నారని చెప్పారు. మా ఎమ్మెల్యే పార్టీ మారాడు అని చెబుతు న్నావు.. ఇప్పటి వరకు నీవు ఎన్ని పార్టీలు మారావో ఆత్మవి మర్శ చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో లింగోజిగూడా డివిజన్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వంకరబుద్ధి మార్చుకుని నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే చేస్తు న్న అభివృద్ధిని చూసి వారికి సహాయ, సహకారాలు అంది స్తే మేమూ స్వాగతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీని యర్ నాయకులు ఆడాల రమేష్, నర్రె శ్రీనివాస్, వరప్ర సాద్, దుర్గ లక్ష్మీ, మధు సాగర్, తుప్పటి శ్రీకాంత్, ప్రవీణ రెడ్డి, అరుణ్, చిత్రం సాయి, తదితరులు పాల్గొన్నారు.