Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కొర్పొరేటర్ పాఠశాలలల్లో పని చేస్తున్న టీచర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని కార్పొరేట్ విద్యా నియం త్రణ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని కార్పొరేట్ విద్యా నియ ంత్రణ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేట్ విద్యాసంస్థ ల ఉపాధ్యాయుల తొలగింపు, జీతాల నిలుపుదలపై శుక్రవా రం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివా సులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసి అధ్యాపకులకు జీతాలు చెల్లించ కుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రభుత్వం సహకరిస్తున్నా.. ప్రతి పక్షాల్లో ప్రశ్నించే గొంతుకను అని చెప్పుకుంటున్న నాయకులు ఎందుకు ప్రయివేటు, కార్పొరేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయని ప్రశ్నించారు. జీతాలు చెల్లించని విద్యా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 45, 46 ఉల్లంఘనకు పాల్పడిన విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నెలరోజులు తరగ తులు బోధించి ఏడాది ఫీజు వసూలు చేసి టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. 11 నెలలుగా జీతాల్లేక ఆకలితో అల్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బోధన, బోధనేతర సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, మరి కొంతమంది ఆకలిచావులతో చనిపో యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొ రేట్ విద్యా నియంత్రణ జేఏసీ ముఖ్య సలహాదారులు గం గుల నరసింహారెడ్డి, లెక్చరర్ జేఏసీ నాయకులు సునీల్, వినోద్‌రెడ్డి, వీరయ్య, తిరుమలేష్ పాల్గొన్నారు.