Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ పెరుగుతున్న కేసులు
- నివారణ చర్యలో జీహెచ్ఎంసీ, పోలీసుశాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గతేడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో విజృంభించిన కరోనా ఈ ఏడాదిలో నూ అదే నెలల్లో కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఏరియాతోపాటు చుట్టుపక్కల్లోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోనూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక పక్క కోవి డ్ వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో మరో పక్క కేసులు పెరగడం ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సైతం నిబంధనలను పాటించాల్సిందేననీ, పాటించకుంటే ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లు పెంచాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో పక్క కరోనా నివారణ చర్యల్లో జీహెచ్ఎంసీ, పోలీసుశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కుధరించకుంటే భారీ గా పెనాల్టీ వేయాలని నిర్ణయించారు.
కేసులు ఇలా..
గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ జిల్లాలో పట్టణ ప్రాంతాలతోపాటు చుట్టు పక్కల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. .జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం 254 కేసులు నమోద య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 97, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో 110 కేసులు నమోదయ్యా యి. ఈ సారి ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 20కిపైగా కేసులు నమోదైనట్టు సమాచారం. ఫలితంగానే జీహెచ్ఎంసీ ఆయా విభాగాలకు వెళ్లే సందర్శ కులు, జర్నలిస్టులను అనుమతి రద్దు చేసిన విష యం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ ఏరియా తోపాటు శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజులపాటు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
మాస్కులేకుంటే కేసే
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన నిబంధనలు అమలు, పర్యవేక్షణ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మాస్కులేకుండ బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేసులు, పెనాల్టీలు వేసే ముం దు గ్రేటర్లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచ కొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని కరోనా నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. నిబంధనలు ఉల్లంఘించడం, కరోనా పాజిటివ్ వచ్చినా ఐసోలేషన్లోలేకుండ బయటి తిరగడం వంటి వాళ్లపై పోలీసుశాఖ నిఘా పెట్టింది.
కరోనా నివారణ చర్యలు ఇలా..
గ్రేటర్ హైదరాబాద్లో రెండో దశ కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నివారణ చర్యలను వేగవంతం చేసి ంది. అందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బం ది పాటించాల్సిన చర్యలు గురించి ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయలోని అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్, డిప్యూటి కమిషనర్లకు కమిషనర్ ఆదే శాలు జారీచేశారు.
1.కార్యాలయంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
2.బహిరంగ ప్రదేశాల్లో కనీసం రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించాలి.
3.కార్యాలయాలు, సెక్షన్లలోకి సందర్శకులను అనుమతించరాదు.
4.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసేవారికి నిబం ధనల మేరకు జరిమానాలు విధించాలి.
5.ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ ర్లను ఏర్పాటు చేయాలి.
6.సందర్శకులు అధికంగా వచ్చే కార్యాలయాలు, విభాగాలలోని డోర్లు, హ్యాండిళ్లు, రాడ్స్లను తరచుగా శానిటైజేషన్ చేయాలి.
7.ఎస్కిలేటర్లు/ లిఫ్ట్ ల వినియోగాన్ని సాధ్యమై నంత తగ్గించి మెట్లపై వెళ్లాలి.
8.ఎమర్జెన్సీ మినహా ఫైళ్లన్నింటిని ఈ-ఆఫీస్ ద్వారానే పంపించాలి.
9.ఎయిర్ కండీషన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలి.