Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47 టైర్లు, వీల్స్ రూ.2లక్షల నగదు రికవరీ
నవతెలంగాణ-హయత్‌నగర్
ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి దానిలో పూర్తిగా నష్టం రావడంతో చేసేదేమీ లేక కారు టైర్లు, వీల్స్ చోరీలు చేస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్ ఎల్బీనగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పెద్దరావులపల్లి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి జిల్లాకు చెందిన గుల్లమ్ బాలకిషన్, అలియాస్ కిషన్ క్యాబ్ డ్రైవర్. అతని స్నేహితుడు అయిన అదే ప్రాంతానికి చెందిన మోటే శ్రీకాంత్‌లు కలసి డబ్బుల కోసం తప్పని పరిస్థితుల్లో చోరీలకు పాల్పడుతుండేవారు. గతంలో కుషాయిగూడ లో కూడా కారు టైర్ చోరీ చేసి జైలు జీవితం గడిపాడు శ్రీకాంత్. పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో ఆగివున్న విలువైన కార్ల టైర్లను, వీల్స్‌ను చోరీలు చేసి పోచంపల్లి వద్ద దాచిపెట్టి అక్కడి నుంచి ఓఎల్ఎక్స్ లో వారికి తెలిసిన వారికి వాటిని విక్రయించేవారు. ఇటీవల ఎల్బీనగర్్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలో కూడా ఆగి ఉన్న కారు టైర్‌ను దొంగిలిస్తుండగా సీసీ కెమెరాల్లో వారి కదలికలు ఉండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 47 టైర్లు, వీల్స్, 2లక్షలు నగదు రికవరీ చేశారు. మొత్తం వారిపై 29 పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. తదనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో యల్ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, డీఐ కష్ణ మోహన్. ఎస్ఐ శివ కుమార్, సిబ్బంది బాల కష్ణ, మనోజ్, అశోక్ రెడ్డి, రాజ్ కుమార్, యాదగిరి, జంగయ్య. పధీ¸్వరాజ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.