Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత సంఘాల నాయకులు
రాంపల్లి: దాయర గ్రామ దళిత మహిళా సర్పంచ్ గరుగుల ఆండాలు గ్రామం లో చేస్తున్న అభివద్ధి పనులు చూసి ఓర్వలేక వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేయడం సమంజసం కాదని దళిత సంఘం రాష్ట్ర నాయకులు ఖండించారు. శనివారం కీసరలో దళిత సైన్యం దళిత హక్కుల సమైక్య సమితి తెలంగాణ కార్మిక సమైక్య సంఘం ఆధ్వర్యంలో రాంపల్లి దాయార సర్పంచ్ గరుగులా ఆండాలుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ రాంపల్లి దాయరా గ్రామంలో గ్రామ ప్రజలకు అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో మండల, జిల్లాస్థాయి ఉత్తమ గ్రామ అవార్డు అందుకున్న సర్పంచ్ అండాలుపై బురద జల్లడం మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డిని హెచ్చరించారు. దళిత ప్రజాప్రతినిధులపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సైన్యం గౌరవ అధ్యక్షుడు చిత్తయ్య, దళిత హక్కుల సమైక్య సమితి నాయకులు తెలంగాణ కార్మిక సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామన్న, మాజీ డైరెక్టర్ మల్లేష్ నాయకులు పాల్గొన్నారు.