Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటు న్నారని ఖాళీగా ఉన్న ఉద్యో గాలను భర్తీ చేసి ఆత్మ హత్యలను జరగకుండా చూడాలని సీఐటీయు జిల్లా కోశాధికారి నార్కట్పెల్లి సబిత అన్నారు. ఈసందర్భంగా ఘట్కేసర్ మూన్సిపల్ పరిధిలోని సీఐటీయు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయని, కొలువులు వస్తే కుటుంబాలు బాగుపడతాయని 12 వందల మంది విద్యార్థుల అమరవీరుల ఫలితంగా రాష్ట్రం ఏర్పడితే, ఈ రోజు అదే విద్యార్థులు నిరుద్యోగులై ఆత్మహత్యలు చేసుకోవడం ఘోరమన్నారు. బోడ సునీల్ నాయక్ ఆత్మహత్యతో ముగింపు ఇవ్వాలని, ఇక ఆత్మహత్యలు చూడకూడదని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీచేసి నియామకాలను, హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృత్తి టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టులో పెట్టుకుంది కానీ అమలుకు నోచుకోని పరిస్థితిలో ఉందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్, కేవీపీిఎస్ జిల్లా ఉపాధ్యాక్షులు బాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షులు బ్యారగి వెంకట్ పాల్గొన్నారు.