Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ డిమాండ్
నవతెలంగాణ-నారాయణగూడ
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌కు సంబంధించి హన్మకొండలో ఫిబ్రవరి 1న ఓసి స్టేట్ మహాగర్జన పేరుతో ఓసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ ప్రజలు రిజర్వేషన్ ద్వారా యోగ్యత లేకుండా ఉద్యోగాలు పొందుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీలను బహిరంగంగా అవమానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్‌రాజ్ డిమాండ్ చేశారు. ఎస్సీలు, ఎస్టీలకు వ్యతిరేకంగా ఓసీలలో శత త్వాన్ని రేకెత్తిస్తూ, ఓసీలు ఉద్యోగాలు పొందడం లేదని, మెరిట్ లేని ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారన్నారు.ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ విషయమై ఫిబ్రవరి-9న శాలిబండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పదవి నుంచి, టీిఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలన్నారు. కేసును సిబి-సిఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలో రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు డాక్టర్ జే.బి.రాజు, గొల్లపల్లి దయానంద్, పీ.వీ.రమణ, ఎరుకల సంఘం నాయకులు లోకిని రాజు పాల్గొన్నారు.