Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం పనిచేస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో కమిషనర్ వాణి ,కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. రాంపల్లి ప్రధాన చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫౌంటెన్ మోడల్, చౌరస్తా పెద్దగా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ నిధులు రూ.50 లక్షలతో పనులు వెంటనే చేపడతామ న్నారు. ప్రజలకు మెరుగైన సమస్యలు కల్పించేందుకు మున్సిపల్ పాలకవర్గం కషి చేస్తుందన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు పంబల్ల సరిత, ఎలిజాల నాగేష్ గౌడ్, గోక కళావతి యాదగిరి, టి.లక్ష్మీ, బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ,కో ఆప్షన్ సభ్యుడు అశోక్ గౌడ్, టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.