Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈనెల 1న నేర విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు పరీక్షలు చేయగా ఐదుగురికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారిం చారు. అనంతరం గురువారం పరీక్షలు నిర్వహించగా నేర విభా గానికి చెందిన మరో ఇద్దరు అధికారులకు కరోనా వైరస్ వచ్చింది అని వైద్యులు నిర్ధారించడంతో మొత్తం సంఖ్య 7కు చేరడంతో పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలకు ఎన్ని జాగ్రత్తలు తెలియజేసినా వినకుండా అవసరం ఉన్నా, లేకున్నా పోలీస్ స్టేషన్లోకి రావడం సరైన పద్ధతి కాదని అధికారులు తెలియజేస్తున్నారు. వైద్యులు సైతం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించినప్పటికీ మాస్కులు విధిగా ధరించాలని, వైరస్ సోకిందని తెలిసి కూడా స్వీయ నియంత్రణకు కషి చేయాలని కోరుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసి శానిటైజర్ అధికారులు రెండు పూటలా శానిటైజర్ చేసి తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఈ రజిత సూపర్వైజర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసి శానిటైజర్ సిబ్బంది పాల్గొన్నారు.