Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఎలక్ట్రికల్ విభాగానికి సంబం ధించి శనివారం ఓయూ ఇన్చార్జి వీసీ అర్వింద్ కుమార్ సమక్షంలో మిడ్వెస్ట్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆ మిడ్వెస్ట్ సంస్థకు ఈ విభాగం ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించిన టెక్నాలజీ అభివృద్ధి చేయాల్సి ఉంది. వీరు భారీ మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలోని పరిశోధన విద్యార్థులకు, అధ్యాపకులకు టెక్నాలజీ అభివృద్ధి చేసినందుకుగాను సంస్థ నుంచి ఫెలోషిప్స్ ఇస్తున్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొపెసర్ గోపాల్‌రెడ్డి, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.కుమార్, హెడ్ జి.యేసురత్నం, ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మల్లేశం, కె.సౌమ్య పాల్గొన్నారు.