Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
2018 ఎన్నికల సమయంలో ప్రభుత్వం నాయీ బ్రా హ్మణులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 6వ తేదీన జరిగే సదస్సు పోస్టర్ ఆవిష్కరణకు అయన ముఖ్య అథితిగా హాజరై ఆవి ష్కరించి మాట్లాడారు. వేలాది కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయనీ, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. పెట్టుబడి దారులు, కార్పొరేట్ బ్యూటీ పార్లర్లు తమ వృత్తిలోకి రాకుండా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరారు. కరోనా కారణంగా గిరాకీలు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభు త్వం ఉపాధికి రుణాలు, 50 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్, పోలీస్‌శాఖలో బార్డర్ పోస్టలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఆవకాశం కల్పించాలి కోరారు. ఈ నెల 6వ తేదీన ఎన్టీఆర్ నగర్‌లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో రంగారెడ్డి జిల్లా సంఘం సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుధాకర్, ప్రసాద్, రాము, కిరణ్, పగిడిమర్రి యాదయ్య, జానయ్య, శ్రీనివాస్, రమేష,్ తదితరులు పాల్గొన్నారు.