Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
వాటర్ సమస్యపై దృష్టి సారించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గోల్నాక డివిజన్ పరిధిలోని తులసినగర్ క్యాంపు కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పైప్ లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వారితో మాట్లాడి పరిష్కరిం చాలనీ, కలుషిత మంచి నీటి సమస్య లేకుండా చూడాలనీ, మంచి నీటి సరఫరాలోలో ప్రెషర్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలనీ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా సమయాన్ని పెంచాలని సూచించారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో పెండింగ్లో ఉన్న మంచి నీటి డ్రెయినేజీ పైప్లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, మంజూరైన పైప్ లైన్ పనులను వెంటనే ప్రారంభించాలనీ, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా ఎక్కడెక్కడ పైప్ లైన్లు వేయాలనే అంశాలపై ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ జీఎం మహేష్ కుమార్, డిజీఎంలు సన్యాసి రావు, సతీష్, మేనేజర్ మహేందర్, ఏఈలు నీరజ, శేఖర్, కుషాల్, తదితరులు పాల్గొన్నారు.