Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
ఏఎస్రావు నగర్ డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీ సంక్షే మ సంఘం ఎన్నికలను ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆది వారం యధాతథంగా నిర్వహించనున్నట్టు ఎన్నికల నిర్వ హణ అధికారులు దుడుక దశరథ, ఎంఎన్. చారి, ఎ ఎ. హుస్సేన్ తెలిపారు. శనివారం కాలనీలోని సీనియర్ సిటి జన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాలనీలోని పార్క్ నెంబర్ 1లో ఎన్నికలతో పాటు కాలనీ సర్వసభ్య సమావేశం కూడా జరుగుతుందని తెలిపారు. కాలనీ పాత కమిటీలోని సభ్యులందరూ తమ పదవుల నుంచి వైదొలగటంతో పాటు కమిటీ కాల పరి మితి పూర్తయిన కారణంగా సీతారాంరెడ్డి కాలనీ విష యంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని వారు తెలిపారు. ఇకనైనా సీతారాంరెడ్డి ఇలాంటి ప్రయ త్నాలు మానుకుని ఎన్నికల కమిటీకి సహకరించాలని కోరారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వ హిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నామనీ, కాలనీవాసులు ఐక్యమత్యంగా ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని, కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వాహణకు కాలనీ సభ్యులు తమ అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో కాలనీ మాజీ అధ్యక్షుడు గూడూరు సుదర్శన్‌రెడ్డి, నాయకులు ఎం.మోహన్, ఎం.సాంబయ్య, జి.రమేష్, నాగు, తదితరులు పాల్గొన్నారు.