Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్ల మెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి హర్షం వ్యక్తం చేశా రు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవస రాలను దృష్టిలో ఉంచుకుని సమీకతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే శ్ కుమార్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయా లని సీఎం నిర్ణయించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నెలకొ న్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్ అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం శుభ పరిణామమని తెలిపారు. రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాలు దిన దినాభి వృద్ధి చెందుతున్నాయనీ, మారుతున్న పరిస్థితులకు అను గుణంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయి ంచడం చాలా సంతోషకరమని తెలిపారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజా ంపేట వంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మేడ్చల్, దమ్మాయి గూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్ల పోచం పల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ వంటి మున్సిపా లిటీల అభివృద్దికి చర్యలు చేపట్టనున్నట్టు సీఎం తెలపడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం అవుతు ందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలన్నీ హైద్రాబాద్ నగర ంలో దాదాపు కలిసిపోయాయనీ, వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన తెలంగాణ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర పడుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించా లని ముఖ్య మంత్రి నిర్ణయించడం గొప్ప విషయం అని తెలిపారు.