Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
నిరుద్యోగ సమస్య పరిష్కారంకోసం పాలకులపై రాజీలేని పోరాటాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నీళ్లు, నిధులు, నియామ కాల కోసం జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలం గాణలో యువతకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. శని వారం ఏఐఎస్ఎఫ్ మేడిపల్లి మండల మహాసభ జరిగి ంది. రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, విద్యకు సరిపడ నిధులు కేటాయించకుండా విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యంపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సర్కారు డిగ్రీ, జూనియర్ కాలేజీల ఏర్పాటు ఎంత వరకు చ్చిందో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. పాఠశాలల్లో ముక్కు పిండి ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు టీచర్లకు మాత్రం వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడు తున్న ప్రయివేటు టీచర్లను సర్కారు ఆదుకోవాలన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
ఏఐఎస్ఎఫ్ నూతన మండల కమిటీని ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా రాథోడ్ అరవింద్, ప్రధాన కార్యద ర్శిగా చిన్న బాబు ఉపాధ్యక్షులుగా సందీప్, ఎదునూరి సాయి, సహాయ కార్యదర్శిగా అజరు కోశాధికారిగా జెక్క సాయి, సంయుక్త కార్యదర్శిగా కొత్తపేట సాయి, కార్యద ర్శివర్గ సభ్యులుగా వినరు, దుర్గా ప్రసాద్, మనోహర్, ఆదర్శ్, కౌన్సిల్ సభ్యులుగా శ్రీనాథ్, రుషికేశ్, శివ, అభిరెడ్డి, సునీల్, సాయి చరణ్ తదితరులను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్, నాగజ్యోతిలు పాల్గొన్నారు.