Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
బోడ సునీల్ నాయక్ది ప్రభుత్వ హత్య అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ ఆరోపించారు. యూనివర్సి టీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే కొలు వులు వస్తాయనీ, కొలువులో వస్తే కుటుంబాలు బాగుపడ తాయని 1200 మంది విద్యార్థుల అమరవీరుల ఫలిత ంగా రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు అదే విద్యార్థులు, నిరుద్యో గులు ఆత్మహత్యలు చేసుకోవటం ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి ఉండదన్నారు. బోడ సునీల్ నాయక్ ఆత్మ హత్యతో ముగింపు అవ్వాలనీ, ఇంకో ఆత్మహత్య చూడకూ డదనీ, ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నియామకాల హామీ లను అమలు చేయాలని డిమాండ్ చేుశారు. బోడ సునీల్ నాయక్ సూసైడ్ చేసుకున్న సమయంలో చాలా వివరంగా 'నేను కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయనందుకే చనిపో తున్నా, నా చావుతో నైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం కండ్లు తెరిచి మిగతా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని'' చాలా ఆవేదనతో చెప్పాడని తెలిపారు. స్వరాజ్యం సాధిం చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాబట్టి, నీళ్లు పక్కదారి పట్టాయి, నిధులు టీఆర్ఎస్ నాయకుల పిల్లలకు దారిమళ్లి కేసీఆర్ కుటుంబం పాలయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బ్యాగరి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సాయి, నాయకులు విజరు, కాశీం, జగదీష్, వినరు, తదితరులు పాల్గొన్నారు.