Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బంగారు తెలంగాణ కాదు నిరు ద్యోగులు లేని తెలంగాణ కావాలని ఎప్ ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాయి కాడి శంకర్ అన్నారు. కాకతీయ యూని వర్సిటీ విద్యార్థి బోడ సునీల్ మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు, యువకులు నేడు స్వరాష్ట్రంలో కూ డా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో చదువుకున్న యువత దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలి పారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చివరికి చికిత్స పొందుతూ మృతి చెందాడనీ, మృతుడు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బంగా రు తెలంగాణలో భవిష్యత్‌కు భరోసా లేదని యువత నిరు త్సాహానికి గురవుతున్నారు. ఎంతోమంది యువకులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరి స్తుందన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవటమే బోడా సునీల్ నాయక్ మృతికి కారణమనీ, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.