Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి
- వామపక్షాల డిమాండ్
- ఈనెల 7న రైల్ నిలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొవిడ్-19 కారణంగా నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను గతేడాది మార్చి లో నిలిపేశారని, దేశంలోని వివిధ నగరాల్లో లోకల్ రైళ్లను ప్రారంభించి నాలు గు నెలలు గడుస్తున్నా హైదరాబాద్‌లో ప్రారంభంకాలేదని, వెంటనే ఎంఎ ంటీఎస్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని వామపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నగరంలో బస్సులు, మెట్రోరైలు ప్రారంభమైనా, ఆర్థిక కలాపాలు ముమ్మరంగా జరుగుతున్నా ఎంఎంటీఎస్ రైళ్లను ఎందుకు ప్రారంభించడంలేదని ప్రశ్నించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, కూలీలకు ప్రయాణం భారంగా మారిందని వామపక్షపార్టీల నేతలు ఎం.శ్రీనివాస ్(సీపీఐ(ఎం)), ఇటీ నర్సింహ్మా(సీపీఐ), ఝాన్సీ(సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ) అనురాధ(సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), తేజ(ఎస్‌యూసీఐ(సీ)), వి, తుకారా నాయక్(ఎంసీపీఐ(యూ)) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్వికపోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడంతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు అర్ధాంతరంగా నిలిచిపో యాయని విమర్శించారు.ఎంఎంటీఎస్ రెండోదశ పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నగరవాసులకు తీవ్ర నష్టం కల్గిస్తోందని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు నిధులు కేటాయించాలని, ఎంఎంటీఎస్ రైళ్లను వెంటనే ప్రారంభించాలని వామపక్షపార్టీల నగర కమిటీల ఆధ్వర్యంలో ఈనెల 7న సికింద్రాబాద్‌లోని రైలు నిలయం వద్ద ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.