Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగుల సమావేశం డిమాండ్
నవతెలంగాణ- అడిక్మెట్
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపండి అని బీసీ నిరుద్యోగ జేఏసీ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఉద్యోగం రాదనే నిరాశతో ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరచి వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నియమించిన పే-రివిజన్ కమిషన్ ప్రభుత్వ శాఖలలో 1,93,500 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించిందని, మొత్తం ఖాళీల భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ-నిస్సహలతో అసంతప్తితో రగిలిపోతున్నారు అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి పటిష్టమైన ఉద్యోగ యంత్రాంగం అవసరం. సమర్థులైన సిబ్బంది ఉన్నప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు, ధ్యేయాలు నెరవేరుతాయన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివిన నిరుద్యోగులు ఉద్యోగ సాధనకు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో పగిడాల సుధాకర్, చంటి ముదిరాజ్, పగిళ్ళ సతీష్, బట్టు గౌడ్, .చంద్రశేఖర్, కుందాల బ్రమ్మయ్య, రవి యాదవ్ పాల్గొన్నారు.