Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివద్ధికి ఎంతో కృషి చేస్తుందని, యువత ఉత్సాహంతో క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అల్మాస్ గూడలోని ఏవైఆర్ క్రీడా మైదానంలో ఏనుగు రాంచంద్రారెడ్డి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్ లతో కలిసి విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, అవి క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. ఇలాంటి పోటీలతో క్రీడాకారుల ప్రతిభ బయటకి వస్తుందని తెలిపారు. 24వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం భవిష్యత్ తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో 44జట్లు పాల్గొనగా, .అందులో ప్రథమ బహుమతి ఇంబ్రాన్ జట్టు, ద్వితీయ బహుమతి అర్ఎంఆర్ జట్టుకు దక్కింది. కార్యక్రమంలో నిర్వాహకులు, రాంరెడ్డి, లక్ష్మిరెడ్డి, నాయకులు సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, రామిడి మాధురి వీరకర్ణ రెడ్డి, ముత్యాల కష్ణ, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, ముద్ద పవన్, నాయుకులు ఏనుగు తిరుమల్ రెడ్డి, నాగేందర్ గౌడ్, తూఫాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.