Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్పిటల్‌పై బాధితుల దాడి
నవతెలంగాణ-అడిక్‌మెట్
వైద్యుల నిర్లక్ష్యంతో రెండు రోజుల శిశువు మృతి చెందిన ఘటన నల్లకుంట దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సలోని అనే మహిళ 2 రోజుల క్రితం నల్లకుంట దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మొదటి రోజు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు, ప్రసవం సమయంలో అందుబాటులో లేకపోవడంతో జూనియర్ డాక్టర్లు నర్సులు డెలివరీ చేశారు. వారికి సరైన అవగాహన లేకపోవడంతో ప్రసవాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారు. సీనియర్ వైద్యులు సైతం నార్మల్ డెలివరీ చేయాలనీ ప్రయత్నించగా శిశువు తలకు గాయాలయ్యాయి. ఇదంతా కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన వైద్యులు పొంతన లేని సమాధానం చెప్పారని బాధితులు ఆరోపించారు. సరైన వైద్యం అందించకపోవడంతో రెండు రోజులకే శిశువు మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై దాడికి పాల్పడి నల్లకుంట పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పి దర్యాప్తు చేసి డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.