Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజనులపైన లైంగికదాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శ్యామూల్ అన్నారు. ఇప్పటికైనా దళిత, బడుగు, బలహీన వర్గాలు ఐక్యమై మతోన్మాద శక్తులను తరిమి కొట్టాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఆదివారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్బీనగర్ ఏరియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతోన్మాద శక్తులు చెలరేగి పోతున్నాయని, దళితులు, గిరిజనులను దారుణంగా చంపిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందువుల్లో భాగమైన మాదిగలను కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటి అని సంఘం జిల్లా అధ్యక్షుడు భీమనపల్లి కనకయ్య ప్రశ్నించారు. ఏప్రిల్ మొత్తం మహనీయుల మాసంగా సంఘ నిర్మాణం యాత్రలు జాతరను నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా ఏరియా కన్వీనింగ్ కమిటీ వేయడం జరిగింది. కన్వీనర్‌గా, జి మనోహర్, కో కన్వీనర్‌గా కాళ్ళ జంగయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పూదరి రమేష్, అనిల్ దుర్గారావు, నరేష్, లక్ష్మయ్య, వీరయ్య, ఎల్లయ్య మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.