Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-హైదరాబాద్
విద్యార్థులను, యువతను మత్తు ఊబిలోకి లాగే గంజాయి స్మగ్లింగ్ ముఠాలోని ఉప్పలయ్య(42), జయరాజు(49) అనే ఇద్దరు గాంజాయి స్మగ్లర్లను ఉప్పల్ ఎక్స్సైజ్ పోలీసులు ఉప్పల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరినుండి పది లక్షల రూపాయల విలువ గల 100కిలోల పొడి గంజాయి, ఆరు లక్షల విలువ గల ఒక కారు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం సిలేరు నుండి హైదరాబాద్లోని గండిమల్ల కుమార్ అనే వ్యక్తికి చేరవేసే క్రమంలో ఉప్పల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. గండిమల్ల కుమార్ పరారీ ఉన్నాడు. ఉప్పలయ్యపై గతంలో భద్రాచలం, రాజమండ్రిలో గంజాయి స్మగ్లింగ్ కేసులు వున్నాయి. ఈ ముఠా సీలేరు నుండి కిలో గంజాయి రెండు వేలకు తెచ్చి, హైదరాబాద్లో కిలో గంజాయి పది వేలకు అమ్ముతూ, యువతను, విద్యార్థులను ఆసరాగా చేసుకొని మత్తు ఊబిలోకి దించుతున్నారు. ఉప్పలయ్య, జయరాజులను పోలీసులు రిమాండ్కు తరలించారు.