Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెంది న అశోక్ విజయ మేరీ దంపతులు. వీరికి 15 ఏండ్ల కుమారుడు ఆశీ ర్వాద్, ఒక కుమార్తె ఉంది. అశోక్ ఖాళీగా ఉంటుండగా విజయ మేరీ కోరి Äలోని ఓ ఆటోమొబైల్ షాప్లో పని చేస్తోంది. ఈ నెల 3వ తేదీన సాయ ంత్రం ఆశీర్వాద తల్లికి ఫోన్ చేసి ఇంటికి త్వరగా రమ్మని కోరాడు. ఆ సమయంలో అతని సోదరి తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. విజయ మేరీ రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో ఇంటికి వచ్చి చూడగా గది లోపల నుంచి గడియ పెట్టి ఉంది. కుమారుని బయటి నుంచి పిలువగా ఆయన తలుపు తెరవలేదు. దీంతో విజయ మేరీ చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంటిలోని గదిలో ఆశీర్వాద్ పడి ఉండటం గమనించారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై సాల్వేరు మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.