Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో డీఎంకే కూట మిదే విజయమనీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ బలపరు స్తున్న ఏఐఏడీఎంకే కూటమి ఓడిపోవడం ఖాయమని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్, ఓయూ లా విభాగం హెడ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆయన తన బృందంతో కలిసి మూడు రోజులుగా డీఎంకె కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సంద ర్భంగా గాలి మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనా శనం చేస్తున్న బీజేపీ బలపరుస్తున్న కూటమిని ఓడించ డమే తమ ధ్యేయమన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. సమైక్య భారత నిర్మా ణం దిశగా అడుగులు వేస్తుందనీ, అందుకే తాము సెక్యు లర్ ప్రాంతీయ పార్టీలను గెలిపించ వలసినదిగా తమిళ నాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ద్రావిడ నల్ల నేలపై తెల్ల జాతి అహంకార ఉత్తరాది పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించా లనీ, ఒక్క సీటు కూడా బీజేపీని గెలవకుండా చేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ బీజేపీ పాగా వేస్తే తమిళనాడు ఇక ఆర్ఎస్ఎస్ పెత్తనం తో, ఢిల్లీ పెద్దల చేతుల్లో రాష్ట్రం నలిగిపోతుందన్నారు. బీజేపీ సౌత్ ఇండియాపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తోంద న్నారు. మరోవైపు అయిన స్థానికంగా విద్యార్థులు, యూత్, మేధావులతో వరుస భేటీ అవుతున్నారు. రానున్న ఎన్నికల ప్రచారంలో డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో కలిసి రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది.