Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర సెంటర్ ఆఫీస్ ఓంకార్ పవన్ బాగ్లింగంపల్ల్లి హైదరాబాద్ అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఆది వారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ వహించగా, ముఖ్య అతి థిగా ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపు ఉపేందర్ రెడ్డి, ఏఐసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ, ఏఐసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్ మాటా ్లడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్లో అతి కీలకమైన సంస్థలను అన్నింటినీ ప్రైవేటీకరణ చేయా లని భావిస్తోందన్నారు. అందులో భాగంగా విద్యుత్, విమా నయానం, రక్షణ, బ్యాంకింగ్, జీవిత బీమా రంగాలను ప్రయివేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాల న్నారు. కరోనా కారణంతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రక టిస్తూ పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు మనదేశ, ప్రజల సంపదను అధ్వాన్నంగా దోచి పెడుతూ దేశంలోనే పేద ప్రజలను అప్పులపాలు చేస్తూ కనీసం సమస్యలను పరిష్క రించలేని బీజేపీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ నుంచి పేదవారికి వారి అకౌంట్లో నెలకు రూ.10వేల చొప్పున ఆరు నెలలపాటు జమ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించు కోవాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఆ లోచనను విరమించుకోవాలనీ, 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వలస, అసంఘటిత కార్మికులు, రైతులు, చేనేత కార్మికుల కు ప్రతి కుటుంబానికీ నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలలపాటు అకౌంట్లో జమ చేయానీ, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయా లనీ, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చాలనీ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పది రోజుల్లో డబ్బులు వారి అకౌంట్లో జమ చేయాలనీ, రైతుల కు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సబ్సిడీ ద్వారా అందించాని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కార్యదర్శులు భద్ర ముని పురుషోత్తం, ఆర్ ఝాన్సీ, పుష్పలత, సీహెచ్ రాజు, ప్రశాంత్, పీటర్, కళావతి, దితర నాయకులు పాల్గొన్నారు.