Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూగోళ శాస్త్ర విభాగానికి మొన్నటి వరకు హెడ్‌గా పని చేసిన ప్రొపెసర్ ఎ. బాలకిషన్ వివిధ అంశాలపై విశేష సేవలు అందిం చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండేండ్ల కాలంలోనే ఏడాది కరోనా, లాక్డౌన్ అయినా ఏడాది కాలంలోనే అనేక సదస్సులు, సెమినార్స్, గెస్ట్ లెచ్చర్స్, వైవిధ్యమైన లాంటి కార్యక్రమలతోపాటు పలు అవగాహ నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానాంగా విభాగానికి సంబంధించిన ఆలూమిని ( పూర్వ విద్యార్థుల సంఘం) ఏ ర్పాటు చేసి పూర్వ విద్యార్థులను ఒకే తాటి మీదకు తీసుకొ చ్చారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి నూత నంగా ''కైటు పెస్టివల్''ను నిర్వహించిన వివిధ రంగాల్లో నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించారు. వరల్డ్ ఫారెస్టు డే సందర్భంగా విద్యార్థులతో మెక్కలు నాటించారు. వాటి సంరక్షణ బాధ్యతలు విద్యార్థులకే ఇచ్చారు. వరల్డ్ వాటర్ డే నిర్వహించి నీటి ఆవశ్యకత, దాని అవసరాలను వివరి ంచారు, భవిష్యత్‌లో దాని అవసరాన్ని వివరించి వృథాకు చర్యలు చేపట్టాలని దానికి విద్యార్థులే అంబాసిడర్స్‌గా ప్రజల్లో అవగాహన కోసం కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా విభాగం ఆవరణలో భూగర్భ జలాలు పెం పొందించడానికి భారీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. విభాగంలో నూతనంగా ప్రహరీని, తారు రోడ్డు నిర్మాణం చేశారు. వివిధ వర్సిటీలు, పరిశోధనా సంస్థలతో, ఉపాధి కల్పనల కోసం ఎంఓయూలు చేసుకున్నారు. ఇక్కడి పీజీ, పీహెచ్డీ విద్యార్థులను పలు రీసెర్చ్, శిక్షణలకు పంపారు. ఇక విభాగంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎల్సీడీ, ఇంటర్నెట్, గ్రంథలయంలో పుస్తకాలు కొనుగోలు చేశారు. విభాగనికి సంబంధించిన విజన్‌లో భాగంగా ఊ హా చిత్రాన్ని రూపొందించారు. సైన్సు కళాశాలలో ఒక్క తమ విభాగానికి చెందిన విద్యార్థులకే ఎక్కువ మొత్తంలో పెలోషిప్స్ వచ్చాయని బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. బాలకిషన్ హయాంలో విభాగ ప్రతిష్టాత్మకను పెంపొంది ంచి, దాని ఉన్నతికి పునాదులు వేశారని చెప్పలి. అకాడ మిక్ గాడిలో పెట్టి అందరి బాధ్యత గుర్తు చేశారు. ప్రొపె సర్ బాలకిషన్ ప్రస్తుతానికి ''నాగి'' జాతీయ ఉపాధ్యక్షు లుగా, ''ఇన్ కా'' కు అధ్యక్షుడుగా వ్యహరిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీకి, వినియోగదారుల ఫోరంకు ఆయన విశేష కృషి చేస్తున్నారు. అక్కడ పలువురు మన్నలు పొందారు. అంతేకాకుండా ఓయూ యూజీసీ హెచ్ఆర్డీసీ డెరైక్టర్‌గా కూడా సదరు సెంటర్లో ఆయన శిక్షణా తరగతులు మరె వరూ నిర్వహించని విధంగా నిర్వహించారు. వివిధ సామా జిక అంశాలపై డిబేట్ కూడా పాల్గొంటున్నారు. లక్డౌన్ సమయంలో ఒక్కరోజు ఇంట్లో లేకుండా సామాన్య ప్రజలకు అనేక సేవలు అందించారు. ఓయూలో ఔట ఎన్ని కల్లో కనీసం పోటీ చేయాడానికి ఎవరు ముందుకురాని వేళ ఆయన ఏకంగా ఫ్యానల్ ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.