Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపల్ పరి ధిలోని ఎన్ఎఫ్సి నగర్ సిహెచ్.ఎల్.ఆర్ గార్డెన్లో 2001-2002 బ్యాచి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనం గా జరిగింది. ఈ సంద ర్భంగా విద్యను బోధించిన ఉపాధ్యాయులను విద్యార్థు లు శాలువా, పూల బొకేతో వారిని ఘనంగా సన్మానించి, పాద నమస్కారాలు చేసుకున్నారు. ఎన్నో రోజుల తరువాత కలిసిన విద్యార్థులు మళ్లీ కలుసుకొని చదువుకునే రోజుల్లో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.సత్యనారాయణ, ఎండి రఫీ, బి.విమల, కే.మంజుల, నరసింహ, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.