Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొడిగే శోభపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ నాయకులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ... ఆమె మాట్లాడిన మాటలు బీజేపీ సంస్కృతికి నిదర్శనం అన్నారు. ఆమెకు జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా రాజకీయబిక్ష పెట్టిన కేసీఆర్‌పై ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. సీఎంను తిట్టడం ఆకాశం మీద ఉమ్మడం లాంటిదన్నారు. 'జడ్పీటీసీ అయినప్పుడు నీ ఆస్తులెంత? ఎమ్మెల్యే అయ్యాక ఎంత? అని ప్రశ్నించారు. పెంచుకున్న ఆస్తులు సరిపోనట్టు పదవీ వ్యామోహంతో బీజేపీలో చేరి లేనిపోని వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. ఆమె పరిధిలో ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఫిర్యాదు చేస్తేనే ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు బొల్లు నాగరాజు యాదవ్, రమేశ్‌గౌడ్, నాగారం ప్రశాంత్, క్రాంతి, ప్రభాకర్ పాల్గొన్నారు.