Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వకులాభరణం కృష్ణ మోహన్
నవతెలంగాణ-బేగంపేట్
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపో యాయి. అమత మహోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో సమాజంలో సంచార కులాల పాత్ర ఎక్కువ కనిపించడంలేదని బీసీ కమిషన్ మాజీ కభ్యులు వకులాభరణం కృష్ణమోహన్జీ అన్నారు. సోమవారం సికింద్రాబాద్లోని ఓహోటల్లో వీరభద్రీయ (వీరముష్టి) నిత్తికోవల జాతీయ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా హాజరై కులవత్తులనే నమ్ముకున్న ఈ జాతులకు కేంద్ర ప్రభుత్వం కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింద న్నారు. అయన మాట్లాడుతూ వీరికి ప్రభుత్వం చేసింది శూన్యమని, వీరికి కల్పించిన ఆర్థిక, సామాజిక, కులవత్తులనే నమ్ముకుని సంచారం చేేసే జాతులకు కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యమని, వీరికి కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్థిక, సామాజిక, భావస్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఉపాధి లాంటి వాటికి ఈ వర్గాలు ఇంకా దూరంగా ఉన్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా 52 శాతం బీసీలకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.1500 కోట్లు కేటాయంచిందని, తెలంగాణ ప్రభుత్వం రూ.5522కోట్లు కేటాయించిందని చెప్పారు. నిరాదరణకు గుర్తెన ఈ జాతుల అభ్యున్నతి కోసం ఏర్పాటు వేసి బాలకష్ణ లేంకే, ఇడాడ్ డీఎన్టీ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరభద్రీయుల ఆభ్యున్నతికి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, ప్రత్యుక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్ష రూపాయల ఉచిత రుణంఅందించాలని గురుకులాల్లో నియోోజకవర్గానికి సీిట్లు కటాయిం చాలని కోరారు. అంతరించిపోతున్న సంబార జాతుల కళలను వరిరక్షించుకోవాలని, దీని కోసం భాష, సాంస్కతిక శాఖ ప్రత్యేక చొరవ తీసుకునేలా కషి చేస్తానని చెప్పారు. ఈ జాతులకు ఏది అవసరమో నిర్దిష్టమైన ప్రణాళికతో డిమాండును రూపొందిం చాలని ప్రభుత్వం దష్టికి తీసుకొని వెళ్లాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఆధ్యక్షులు నాకన్ ఉపంద్రకరీ, వ్యవస్థావకులు చెవ్వ ఎల్లయ్య, రాష్ట్ర అధ్యక్షులు చెవ్వ పాండు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివయ్య, ప్రధాన కార్యదర్శి వెన్నెల నాగరాజు, మిట్టపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.