Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిషోర్ కొనియాడారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 114 వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, సీజీఎం విజయరావు, జీఎం హరి శంకర్, జలమండలి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, అశోక్, శంకర్ ప్రసాద్, నర్సింగ్ రావు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.