Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
తన ఇద్దరు పిల్లలతో సహాతల్లి కనిపించ కుండాపోయిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గంధం బాపిరాజు శ్యామల దంపతులకు పదేండ్ల కిందట వివహమైంది. నల్లకుంట ప్రాంతంలోని పద్మాకాలనీలో ఉంటు న్నారు. వీరికి అకేష్ (7) మిస్సీ(5) అనే ఇద్దరు పిల్లలున్నారు. గత శుక్రవారం గంధం బాపిరాజు తన భార్య శ్యామల రాత్రి సమయంలో ఫోన్ చూస్తుండగా అతను ఆమె మందలించాడు. తర్వాత నిద్రపోయాడు. మధ్యలో మేల్కొని చూడగా తన ఇద్దరు పిల్లలతో సహా భార్య కనిపించలేదు. వెతికినా ప్రయోజనంలేకపోవడంతో నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.