Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఓ యువతి అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్ బ్లాక్ - ఎ లో నివాసం ఉంటున్న శ్రీప్రియ (21) సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీప్రియ సోదరుడు కె.శణ్ముఖ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.