Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
- విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్
- ఎస్ఎఫ్ఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్
నవతెలంగాణ-హస్తినాపురం
రాష్ట్రంలో బార్లు ఓపెన్‌చేస్తే, ఎన్నికల క్యాంపెయిన్లు పెడితే రాని కరోనా బడులు ఓపెన్చేస్తేనే వస్తుందా? అని వక్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యా సంస్థలను ప్రారంభిం చాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల సాహితీ జూనియర్ కాలేజీలో విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బార్లు, బస్సులు, మాల్స్, సినిమాహాళ్లు నడుస్తున్నప్పటికీ వీటికి వర్తించని కొవిడ్ రూల్స్ కేవలం విద్యా సంస్థలకు, విద్యార్థులకే ఎందుకు అని ప్రశ్నించారు. గురుకులాల్లో కొంతమంది విద్యార్థులకు కరోనా సోకడంతో రాష్ట్రం మొత్తం విద్యాసంస్థల మూసివేత సరికాదని, ఇది విద్యారంగాన్ని పక్కదోవ పట్టించడమేనని ఆరోపించారు. విద్యా సంస్థల్లో కొవిడ్ నివారణకు అసెంబ్లీ లో బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని, నివారణా చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. కొవిడ్ రూల్స్ పాటిస్తూ రాష్ట్రంలో విద్యాసంస్థలను వెంటనే ఓపెన్ చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. అడ్వకేట్ అరుణ్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం, తిరుమలరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్యామ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్, టి ఎల్ఎఫ్ జిల్లా సెక్రటరీ సిద్దేశ్వర్, కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాస్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల నర్సింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, ఉపాధ్యక్షులు జగన్, జంగయ్య, నాయకులు శివ, ఉదరులు పాల్గొన్నారు.