Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కూకట్పల్లి లోని పలు అభివద్ధి కార్యక్రమాలు, అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా రూ.99లక్షల వ్యయంతో కూడిన, కేపిహెచ్బి 5వ ఫేస్ నుండి, సఫ్దర్ నగర్‌కి వెళ్లే కనెక్టివిటీ రోడ్‌ను ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో మంత్రి కెేటీిఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్‌కి సంబంధించిన సఫ్దర్ నగర్‌కి నూతన కనెక్ట్టివిటీ రోడ్ రావడం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా ఇప్పటి వరకు డివిజన్లోని పలు బస్తీలలో, టీఆర్ఎస్ పభుత్వం, మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కష్ణ్ణా రావు, సహాయ సహకారాలతో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంద న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కి మనస్పూర్తి గా కతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో భారీ ఎత్తున అల్లాపూర్ సమైక్య గ్రూప్ మహిళలు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నేతలు, ప్రెసిడెంట్లు, అనుబంధ కమిటీ సభ్యులు, వార్డు మెంబెర్లు పాల్గున్నారు.