Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేటీసీ పాండురంగ నాయక్
నవతెలంగాణ-సిటీబ్యూరో
డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జె.పాండురంగ నాయక్ అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ 114వ జయంతి సందర్భంగా సోమవారం నాగోల్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. నాగోల్ ఆర్టీవో సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేటీసీ పాండురంగ నాయక్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆ మహానాయకుని ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ సీనియర్ ఎంవీఐ పర్వీందర్ రాజు, వికారాబాద్ ఇన్చార్జి ఆర్టీవో భద్రు నాయక్, ఎంవీఐ రవి కుమార్, ఏవో హనుమంతేశ్వర్ రావు పాల్గొన్నారు.