Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకుని నకిలీ జీవో తయారు చేసిన నిందితుడు
- ల్యాప్‌టాప్, ఐఫోన్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసలే కరోనా కేసులు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆందోళనలో ఉంటే.. వారిని మరింత భయాందోళనకు గురిచేసేలా ప్రభుత్వం ఈనెల చివరి వరకు లాక్డౌన్ విధిస్తోందని వాట్సాప్‌లో నకిలీ జీవోను వైరల్ చేసిన నిందితుడిని సీసీఎస్, టాస్క్ఫోర్సు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి డెల్ ల్యాప్‌టాప్, ఐ-ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల మేరకు నెల్లూర్‌కు చెందిన శ్రీపతి సంజీవ కుమార్ మాదాపూర్‌లో నివాసముంటు న్నాడు. బీకాం వరకు చదువుకున్నాడు. 10 సంవత్సరాలుగా బంజారాహిల్స్‌లోని కార్వేలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా పనిచేస్తున్నాడు. స్నేహితులను, బంధువులను ఏప్రిల్ ఫూల్ చేయా లని ఆలోచించిన నిందితుడు కొవిడ్ వైరస్‌తో భయపెట్టాలనుకున్నాడు. ఇందులో భాగంగా గతేడాది ప్రభుత్వం లాక్డౌన్ సందర్భంగా విడుదల చేసిన జీవోలను డౌన్లోడ్ చేసుకున్న నిందితుడు దాన్ని మార్ఫింగ్ చేశాడు. రాష్ట్రాంలో ఈ నెల చివరివరకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని నకిలీ జీవోను తయారు చేశాడు. దాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. స్నేహితు లను, బంధువులను ఏప్రిల్ ఫూల్ చేసి ఆటపట్టిం చేందుకు తయారు చేసిన నకిలీ జీవో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ రాజేశ్‌లు దాదాపు 1800 సెల్ఫోన్లను వెరిఫికేషన్ చేశారు. అన్నికోణాల్లో విచారించిన పోలీసులు నిందితు డిని అరెస్టు చేశారు. వాట్సాప్‌లో వచ్చిన సమాచా రాన్ని పూర్తిగా నిర్ధారించుకోకుండా వైరల్ చేయగూడదని సీపీ కోరారు. అనుమానం వచ్చిన సమాచారాన్ని డయల్ 100కు గానీ నేరుగా పోలీస్ స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.