Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న తాగునీటి పైపులైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. డివిజన్లోని ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి వస్తే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. డివిజన్ ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.