Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ:
హైదర్‌నగర్ డివిజన్లోని సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రశాంత్‌నగర్ కాలనీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకరావడంతో స్పందించిన ఆయన సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఎయిర్‌టెక్ మిషన్ ద్వారా సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు ప్రభాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఆశీర్వాదం, వెంకటేష్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.