Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రావూస్ ఈఎన్టీ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ జివి.ఎస్. రావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కరోనా మహమ్మరి నుంచి కాపాడుకోవాలంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలని రావూస్ ఈఎన్టీ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ జివి.ఎస్.రావు అన్నారు. సోమవారం ఆ ఆస్పత్రి ఆధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీలో ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు. ప్రపంచంలో మొదటగా దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అందరూ వాక్సిన్ తీసుకో వాలని, తీసుకున్న వారికి కొవిడ్ వచ్చినా త్వరగా కోలుకుంటారని తెలిపారు. కొవిడ్ నుంచి రక్షణకోసం మాస్కులు, చేతికి గ్లౌజులు వంటివి ధరించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్యరావు, డాక్టర్ శ్రీరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.