Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతి సోమవారం ఒక దివ్యాంగుడికి వీల్ చైర్ పంపిణీ చేస్తానని టీిఆర్‌ఎస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపిన విధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలుకానగర్ డివిజన్ బొడ్రాయి గల్లీకి చెందిన రాములు (80)కి వీల్ చైర్ అందజేశారు. సమాజసేవలో భాగంగా దివ్యాంగులకు విల్ చైర్ పంపిణీ చేస్తున్న బన్నాల ప్రవీణ్‌ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అభినందించారు. అనంతరం బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ దివ్యాంగులకు వీల్ చైర్ అందించడం తన పూర్వజన్మ సుకతం అని, నడవలేక ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు తనను సంప్రదించాలని (9676456799) ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సహకారంతో అర్హులైన దివ్యాంగులకు ప్రతి సోమవారం వీల్‌చైర్ ను పంపిణీ చేస్తానని తెలిపారు. వీల్ చైర్‌ని అందుకున్న రాములు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్‌కి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లినర్సింగ్, ఏదుల కొండల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటేష్ బింగ శ్రీనివాస్, బాలు, కె.సుధాకర్ వినీష్, టి.ఫణి సంపత్, శ్రీధర్, రెహమాన్, ఆండాలమ్మ పాల్గొన్నారు.